Couple suicide attempt: తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో దంపతుల ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన దంపతులు అరిగెళ నాగార్జున, భవాని ఆత్మహత్యకు యత్నించారు. చిట్టమూరు మండలం ఉప్పలమద్ది గ్రామంలో ఉన్న తమ పొలాలకు పాసుపుస్తకాలు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించినా స్పందించలేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించారు. సంవత్సరాల తరబడి తమ సమస్యకు పరిష్కారం చూపలేదని పాసుపుస్తకాలు జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున బ్లేడుతో చేతిని కోసుకోగా ఆయన భార్య భవాని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించినా పాసు పుస్తకాలు జారీ చేయలేదన్నారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రుయా ఆస్పత్రి అత్యవసర విభాగంలో నాగర్జున దంపతులకు వైద్యసేవలు అందిస్తున్నారు.
కలెక్టరేట్ ఆవరణలో దంపతుల ఆత్మహత్యాయత్నం... ఎక్కడంటే..? - తిరుపతి జిల్లా తాజా వార్తలు
Couple suicide attempt: జిల్లా పాలనాధికారి కార్యాలయం ఆవరణలోనే దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. పురుగుల మందు తాగి భార్య, బ్లేడుతో చేసుకుని భర్త ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..?
దంపతుల ఆత్మహత్యాయత్నం