ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలిపిరి వద్ద భక్తులకు కరోనా పరీక్షలు: తితిదే ఈవో

తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులలో రోజుకు వంద మంది నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించాలని తితిదే ఈవో అధికారులకు సూచించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు.

అలిపిరి వద్ద భక్తులకు కరోనా పరీక్షలు: తితిదే ఈవో
అలిపిరి వద్ద భక్తులకు కరోనా పరీక్షలు: తితిదే ఈవో

By

Published : Jun 30, 2020, 1:16 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతి తితిదే పరిపాలనా భవనంలోని ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులలో రోజుకు వంద మంది నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరించాలని అధికారులకు సూచించారు. వీటి ఫలితాలు త్వరగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్​ను కోరారు.

సిబ్బంది కోసం ప్రత్యేక వార్డు

కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగులకు వైద్యసేవలు అందించడానికి వీలుగా తిరుపతి కేంద్రీయ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేయాలన్నారు. తితిదే పరిధిలోని బర్డ్‌ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

కరోనా చికిత్సా కేంద్రంగా శ్రీనివాసం

చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో చికిత్స అందించడానికి తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయాన్ని తమకు కేటాయించాలని కలెక్టర్ భరత్‌ నారాయణ గుప్తా ఈఓను కోరారు. ఇప్పటికే తితిదే వసతి గృహం పద్మావతి నిలయాన్ని కరోనా రోగులకు చికిత్స అందించడానికి కరోనా కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న విషయాన్ని కలెక్టర్‌ ఈఓకు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఈఓ శ్రీనివాసం వసతి సముదాయాన్ని కలెక్టర్‌కు అప్పగించాలని జేఈవో బసంత్‌కుమార్‌కు సూచించారు. పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఈవో, ఇద్దరు ఏఈవోలతో పాటు అవసరమైనంత సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details