తిరుమలలో భక్తునికి కరోనా లక్షణాలు..? - తిరుమల వెళ్లిన భక్తునికి కరోనా లక్షణాలు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించాయి. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న అతడిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
తిరుమల వెళ్లిన భక్తునికి కరోనా లక్షణాలు!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. వారణాసి దర్శనం తరువాత తిరుమలకు వెళ్లిన మహారాష్ట్రకు చెందిన భక్తుడు తిరుమలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రజర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తుడికి... తిరుమలలోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు. ఇవీ చదవండి.. కరోనా ఎఫెక్ట్.. తిరుమల ఘాట్రోడ్లు మూసివేత