పాఠశాలలు తెరుచుకొని మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే కరోనా భయం వెంటాడుతోంది. ప్రకాశం జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో... విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. నాలుగు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా వచ్చినట్లు తాజా జాబితాలో వెల్లడైంది.
జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి....త్రిపురాంతకం హైస్కూల్‍లో ఉపాధ్యాయుడికి,
పీసీపల్లి హైస్కూల్‍లో విద్యార్థి, ఉపాధ్యాయుడికి కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయ్యింది. అదే విధంగా పెద్దగొల్లపల్లి హైస్కూల్‍లో మరో ఉపాధ్యాయుడికి వైరస్ సోకింది. ఒక్కసారిగా కేసులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల ప్రారంభంలో కూడా జిల్లాలోని రెండు పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయలు, విధ్యార్థులకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. వీరంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. విద్యాసంస్థలు ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.