IIT STUDENTS EFECTED BY COVID: చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీలో కరోనా తాండవం చేస్తోంది. ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 40 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఐఐటీ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిని క్యాంపస్‌లోని క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈనెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లడంతో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
IIT STUDENTS EFECTED BY COVID: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం.. 70 మందికి పాజిటివ్ - tirupathi iit students
IIT STUDENTS EFECTED BY COVID: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. 214 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 40 మంది విద్యార్థులకు, 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఐఐటీ అధికారులు తెలిపారు.
![IIT STUDENTS EFECTED BY COVID: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం.. 70 మందికి పాజిటివ్ తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14259734-432-14259734-1642918189586.jpg)
తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం