ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా - తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం

తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరిలో ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనా వచ్చిన వారిని తిరుపతి స్విమ్స్‌కు తరలించనున్నారు.

corona attack in veda school students in tirumala
తిరుమల వేద పాఠశాలలో మరో పది మందికి కరోనా

By

Published : Mar 15, 2021, 3:37 PM IST

తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం రేగింది. 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధరణ అయింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది, కుటుంబసభ్యులకు.. తితిదే కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. మొత్తం 75 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించారు. కరోనా వచ్చిన వారిని తిరుపతి స్విమ్స్‌కు తరలిస్తున్నారు.

గత వారం వేద పాఠశాలలో 57 మందికి కొవిడ్‌ నిర్ధరణ కాగా.. పాఠశాల నుంచి ఇతర విద్యార్థులు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో ఉన్న 21 మందిలో ఆరుగురికి వైరస్‌ సోకింది.

ABOUT THE AUTHOR

...view details