చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో తాజాగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాగలాపురం 7, సత్యవేడులో 3 కేసులు నమోదు కాగా.. శ్రీకాళహస్తి, పిచ్చాటూరు, వి.కోట, రామకుప్పం, దామినేడులో ఒక్కో కేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 192 కు చేరింది. సోమవారం నమోదైన 15 కేసుల్లో.. 12 కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవిగా అధికారులు ప్రకటించారు. కోవిడ్ ఆసుపత్రి నుంచి జిల్లాలో ఐదుగురు డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు జిల్లాలో కోలుకున్న వారి సంఖ్య 82 గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 110 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాలో తాజాగా 15 కరోనా పాజిటివ్ కేసులు - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లాలో ఈరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 192కు చేరింది. సోమవారం వెలువడ్డ 15 పాజిటివ్ కేసుల్లో 12 కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉన్నవిగా అధికారులు ప్రకటించారు.
corona cases