రాష్ట్రంలో కొత్తగా 909 కరోనా కేసులు నమోదు - andhrapradhesh corona cases updates
17:00 August 16
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 46,962 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 909 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,543 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
కరోనాతో చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
ఇదీచదవండి.