తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తు కేటాయింపు వివాదాన్ని రాజేసింది. గతంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఉప ఎన్నికలో నవతరం పార్టీ (స్వతంత్ర)కి ఎన్నికల అధికారులు కేటాయించారు. జనసేనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఇంకా హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో.. నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇందులో రాజకీయ కుట్ర ఉందంటూ వైకాపాపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులే అభ్యర్థులకు వర్తింపజేశామని ఎన్నికల అధికారి అయిన నెల్లూరు కలెక్టరు చక్రధరబాబు తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికలో ‘గుర్తు’ వివాదం - తిరుపతి ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తు వివాదం
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తుపై వివాదం తలెత్తింది. జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించటాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకించింది.
గాజు గ్లాసు గుర్తుపై వివాదం