ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అడుగు పడదు... అవసరం తీరదు! - Construction of slow-moving pediatric hospitals

రాష్ట్రంలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో వీటిని నిర్మించాలని ప్రభుత్వం రెండునెలల కిందట నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.180 కోట్లు ఖర్చు చేయనుంది.

ఆస్పత్రి
ఆస్పత్రి

By

Published : Sep 6, 2021, 7:25 AM IST

రాష్ట్రంలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. విజయవాడ, విశాఖ, తిరుపతిలలో వీటిని నిర్మించాలని ప్రభుత్వం రెండునెలల కిందట నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.180 కోట్లు ఖర్చు చేయనుంది. తిరుపతిలో ఇప్పటికే స్విమ్స్‌, రుయాతోపాటు అరవింద కంటి ఆసుపత్రులు ఉన్నాయి. టాటా క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్మాణంలో ఉంది. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఏమీ లేవు. రుయాలో విభాగమున్నా అక్కడ కొన్ని వ్యాధులకే చికిత్స అందిస్తారు.

ఈ నేపథ్యంలో వరంలా... చిన్నపిల్లల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయిదు నుంచి 13 ఎకరాల భూమిని ఎంపిక చేసి డీపీఆర్‌లు పంపించాల్సిందిగా ఆదేశించింది. ఇందులో భాగంగా తిరుపతిలో అయిదు స్థలాలను ప్రాథమికంగా గుర్తించారు. అలిపిరి ప్రాంతంలో తితిదేకు, జూపార్కు వద్ద పర్యాటక శాఖకు ఉన్న భూములను, ఎస్వీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన స్థలాలనూ పరిశీలించారు. తిరుపతికి ఆనుకుని ఉన్న మంగళం ప్రాంతంలోనూ భూమి అందుబాటులో ఉన్నట్లు నిర్ధారించారు. వీటిపై అధికారులు సర్వే చేసి, ప్రతిపాదనలు రూపొందించారు. అయితే... నిర్మాణం ఎక్కడ చేపట్టాలనే విషయమై స్పష్టత రాలేదు. ప్రభుత్వానికి త్వరగా డీపీఆర్‌లు పంపిస్తేనే నిధుల కేటాయింపు జరిగే ఆస్కారముంది.

విజయవాడ, విశాఖల్లోనూ అంతే

విజయవాడ పరిధిలోనూ ఇప్పటివరకు ప్రక్రియ ముందు సాగలేదు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని ఖరారు చేయలేదు. విశాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ రాణి చంద్రమదేవి ఆసుపత్రిలో ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అయితే సంబంధిత పూర్తిస్థాయి కసరత్తు చేపట్టలేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముందడుగు వేస్తే చిన్నారులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఇదీ చదవండి:మద్య నిషేధం హామీ గాలికి... ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు యత్నాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details