ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శభాష్ పోలీస్: సొమ్మసిల్లిన మహిళను 6 కిలోమీటర్ల మోసుకెళ్లి కాపాడాడు! - తిరుమలలో కానిస్టేబుల్ సమయస్భూర్తి

తిరుమలలో పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని కానిస్టేబుల్‌ అర్షద్​ కాపాడారు. దాదాపు 6 కిలోమీటర్ల దూరం భుజాలమీద మోసుకెళ్లి శభాష్​ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

police save women
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్​

By

Published : Dec 24, 2020, 12:40 PM IST

Updated : Dec 24, 2020, 12:54 PM IST

తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఇద్దరిని.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ షేక్ అర్షద్... దాదాపు 6 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవి మార్గంలో భుజాలపై మోసుకుని వెళ్లారు. కాలి నడకన తిరుమలకు బయలుదేరిన నాగేశ్వరమ్మ... 'గుర్రపు పాదం' వద్ద హైబీపీతో కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది.

ఆమెను గమనించిన కానిస్టేబుల్ అర్షద్.. పెద్ద సాహసమే చేశారు. 6 కిలోమీటర్లపాటు భుజాలపై మోసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అంతకుముందు నాగేశ్వరరావు అనే వృద్ధుడిని సైతం ఇలాగే భుజాలపైనే మోసుకెళ్లారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్​
Last Updated : Dec 24, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details