ముఖ్యమంత్రి జగన్ ధర్మయుద్ధంలో గెలవలేరని తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విమర్శించారు. వైఎస్ వివేకా కుమార్తై సునీత ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పరిస్థితి..ఈసారి భాజపాకు రాబోతుందని చెప్పారు. అధిక ధరలు.. భాజపా పతనానికి ప్రధాన హేతువు అని తెలిపారు. తిరుపతిలో పవన్ పర్యటన వల్ల ప్రయోజనం శూన్యమని ఎద్దేవా చేశారు. జగన్ మీద కోపాన్ని షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారన్న ఆయన.. 6 నెలల తర్వాత జగన్ అధికారంలో ఉండరని జోస్యం చెప్పారు. ప్రలోభాలు లేకుంటే కాంగ్రెస్‌కు మళ్లీ ఆదరణ వస్తుందన్నారు.
వివేకా కుమార్తె ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలి: చింతామోహన్
వివేకా కుమార్తె ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. ఆరు నెలల తరువాత జగన్ అధికారంలో ఉండరని ఆయన వ్యాఖ్యానించారు.
చింతామోహన్