తిరుమల: శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన - tirumala latest
21:03 January 13
తితిదే ఈవో, అదనపు ఈవో వైఖరికి నిరసనగా నినాదాలు
తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద భక్తులు ఆందోళన చేశారు. స్వామివారి దర్శనం బాగా ఆలస్యం అవుతోందని.. తితిదే ఈవో, అదనపు ఈవో వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. క్యూలైన్లలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆహారం, తాగునీరు ఇవ్వడం లేదని భక్తులు ఆరోపించారు. పిల్లలు, వృద్ధుల ఇబ్బందులు పడుతున్నా.. వారి కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు.
ఇదీచదవండి: CHANDRABABU : 'పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా'