ఇప్పటికే ప్రొటోకాల్, వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమైందన్న విమర్శలు వస్తున్న వేళ... ధర్మకర్తల మండలి(ttd board) సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 81 మందిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ జంబో జాబితా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరందరికీ దర్శన టికెట్లిచ్చే అధికారం కల్పిస్తే రోజూ సుమారు 2వేల వీఐపీ బ్రేక్ దర్శనాలు, 2 వేల 400 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు కేటాయించొచ్చు. అప్పుడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత కష్టంగా మారుతుంది.
తెలుగుదేశం హయాంలో తితిదే ఛైర్మన్ సహా 14 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండేవారు. వైకాపా హయాంలో తొలిసారి ఛైర్మన్ సహా 25 మంది బోర్డు సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. బుధవారం ప్రకటించిన జాబితాలో ఆ సంఖ్య రెట్టింపు కంటే పెరిగి 81కి చేరింది. ఇందులో బోర్డు తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరిని నియమించారు. వీరికి బోర్డు సమావేశాల్లో ఓటింగ్ హక్కు తప్ప... సభ్యులకు ఉండే మిగిలిన అధికారాలన్నీ ఉంటాయి. అదనంగా తితిదే తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని తీసుకున్నారు. వీరు బోర్డు పరిధిలోకి రారని చెబుతున్నా దర్శన టికెట్లు కేటాయించే అధికారం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సామాన్యులకు దర్శనం మరింత సమస్యగా మారనుంది.
పెద్దఎత్తున సిఫార్సు లేఖలు...