ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 8, 2021, 8:47 PM IST

ETV Bharat / city

11న తిరుమలకు సీఎం జగన్​..ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్​ ఈ నెల​ 11న తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తితిదే ఈవో, అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించారు.

తితిదే ఈవో
తితిదే ఈవో

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్​ 11, 12వ తేదీలలో సీఎం జగన్​ తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. తితిదే ఈవో జవహర్​ రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణ్​, ఎస్పీ వెంకట అప్పల నాయుడు..సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

బర్డ్​(BIRRD)లో ఆసుప‌త్రి ప్రారంభం

సీఎం జగన్​ 11న మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తితిదే బ‌ర్డ్(BALAJI INSTITUTE OF SURGERY, RESEARCH AND REHABILITATION FOR THE DISABLED) ఆసుప‌త్రిలో శ్రీ వేంక‌టేశ్వర పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభిస్తారు. అలిపిరి కాలిన‌డ‌క మార్గం పున:ప్రారంభంతో పాటూ అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్దగ‌ల గోమందిరంను ప్రారంభిస్తారు.

శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పణ

ఆ తర్వాత సీఎం తిరుమ‌ల‌కు చేరుకుని సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి గరుడసేవలో సీఎం పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి..12న ఉద‌యం మరో మారు శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటారు.

ఎస్వీబీసీ క‌న్నడ‌, హిందీ ఛాన‌ళ్ల ప్రారంభం

అదేరోజు ఎస్వీబీసీ క‌న్నడ‌, హిందీ ఛాన‌ళ్లను, నూత‌న బూందీ పోటును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి పర్యటించే శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, మాడ వీధులు, గొల్లమండ‌పం, బూందీ పోటు త‌దిత‌ర ప్రాంతాల‌ను అధికారులు ప‌రిశీలించారు.

అన్నమయ్య భవన్‌లో అన్నివిభాధిపతులతో ఈవో, కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జ‌రిగేలా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వయం చేసుకోవాల‌ని సూచనలు చేశారు.

ఇదీ చదవండి:Thirumala Brahmotsavalu: చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

ABOUT THE AUTHOR

...view details