ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​ బెయిల్​ను రద్దు చేయాలి: చింతా మోహన్​ - chinta mohan latest news

షరతులు ఉల్లంఘించినందున సీఎం జగన్​ బెయిల్​ను రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. జగన్‌పై వందల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయని.. సాక్షులను సీఎం ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు.

Chinta Mohan
కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌

By

Published : Apr 29, 2021, 1:16 PM IST

జగన్ బెయిల్ రద్దు చేయాలని.. తిరుపతి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన చింతా మోహన్ అన్నారు. బెయిల్ షరతులను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. జగన్‌పై వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో బంగారు లక్ష్మణ్‌ను జైలుకు పంపారన్నారు. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహ నిందితులైన అధికారులకు పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు బయటి నుంచి వచ్చిన చాలా మందికి కరోనా సోకిందని ఆరోపించారు. పోలింగ్, ఫలితాలకు మధ్య ఇన్ని రోజుల వ్యత్యాసమెందుకని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details