స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం జగన్ - స్వర్ణోత్సవ విజయ దివాస్ ఉత్సవాలు వార్తలు
తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న స్వర్ణోత్సవ విజయ దివస్ ఉత్సవాల ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం జగన్ హాజరుకానున్నారు.
తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం స్వర్ణోత్సవ విజయ దివస్ వేడుకలు నిర్వహించనున్నారు. అక్కడి ఏర్పాట్లను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు పరిశీలించారు. మిలిటరీ ఆధీనంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఈ వేదిక వద్దకు సీఎం చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. 1971 సంవత్సరంలో భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన తిరుపతికి చెందిన విశ్రాంత సైనికులను ముఖ్యమంత్రి జగన్ సన్మానించనున్నారు.