ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం తిరుమల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు - సీఎం తిరుమల పర్యటన

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 23న ముఖ్యమంత్రి జగన్..స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం తిరుమలలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో, ఇతర అధికారులు పరిశీలించారు.

సీఎం తిరుమల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
సీఎం తిరుమల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

By

Published : Sep 21, 2020, 8:30 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమ‌ల ప‌ర్యట‌నకు సంబంధించిన‌ ఏర్పాట్లను ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి ప‌రిశీలించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి...24న ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలసి స్వామివారిని దర్శిచుకుంటారు. అనంతరం నాదనీరాజన వేదికపై నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొని...ఈవో వసతి సముదాయం శంఖుస్థాపన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

ముఖ్యమంత్రులు పర్యటించే బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం నుంచి శ్రీ‌వారి ఆల‌యం వరకు భద్రతను పెంచారు. ఏర్పాట్లను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. నాద‌నీరాజ‌నం వేదిక‌పై భ‌ద్రత‌, అలంక‌ర‌ణ‌, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చ‌ర్చించారు.

ABOUT THE AUTHOR

...view details