ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్...శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల వేదమంత్రాల మధ్య సీఎం జగన్ తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం గరుడవాహనసేవలో పాల్గొన్నారు.

సీఎం జగన్
సీఎం జగన్

By

Published : Sep 23, 2020, 5:29 PM IST

Updated : Sep 23, 2020, 10:53 PM IST

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా...రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. తితిదే అర్చకులు సీఎం జగన్‌కు తలపాగా అలంకరించారు. బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో బయలుదేరిన సీఎం... స్వామివారికి సమర్పించారు. 2021 క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్ గరుడవాహన సేవలో పాల్గొన్నారు. సీఎం ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

దిల్లీ నుంచి తిరుమలకు సీఎం

ముఖ్యమంత్రి జగన్ తిరుమల చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వచ్చిన సీఎంకు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి స్వాగతం పలికారు. అక్కడనుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్​కు... పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో స్వాగతం పలికారు. సీఎం పర్యటనతో మంత్రులు సుచరిత, వెల్లంపల్లి, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తిరుమల చేరుకున్నారు. డిక్లరేషన్ వివాదంతో తిరుమల పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

తిరుమల చేరుకున్న సీఎం జగన్

గురువారం కార్యక్రమాలు

రేపు ఉదయం కర్ణాటక సీఎంతో కలిసి సీఎం జగన్ మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం అనంతరం నాదనీరాజనంపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ రేపు ఉదయం 8.10 గం.కు కర్ణాటక సత్రాల నూతన సముదాయానికి భూమిపూజ చేయనున్నారు.

ఇదీ చదవండి :మోదీ సతీసమేతంగా పూజలు చేశారా?: మంత్రి కొడాలి నాని

Last Updated : Sep 23, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details