ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత - తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు... తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని వారం రోజులపాటు నిలిపివేసింది. గురువారం రాత్రి వరకూ తిరుమలలో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించిన అనంతరం.. భక్తుల ప్రవేశాన్ని నిలిపేస్తున్నామని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని వెల్లడించారు.

శ్రీవారి ఆలయం మూసివేత
శ్రీవారి ఆలయం మూసివేత

By

Published : Mar 20, 2020, 6:51 AM IST

Updated : Mar 20, 2020, 10:32 AM IST

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు.. దేశంలో రోజుకు సగటున అత్యధికంగా భక్తులు దర్శనం చేసుకునే కలియుగ వైకుంఠనాథుని ఆలయ ప్రవేశాన్ని వారం రోజులపాటు నిలిపేశారు. శ్రీవారి దర్శనానికి తిరుమల గిరులకు చేరుకొనే అలిపిరి, శ్రీ‌వారి మెట్టు కాలినడక మార్గాలతో పాటు వాహనాలు వెళ్లే కనుమ రహదారులను తితిదే మూసివేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ విరామ సమయ దర్శన టికెట్లు కలిగి... గురువారం నాటికి తిరుమలకు చేరుకొన్న భక్తులకు మాత్రమే ఉదయం వరకూ దర్శనం కల్పించింది. మధ్యాహ్నం నుంచి భక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపేస్తున్నామని ఆలయ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్ ప్రకటించారు. కళ్యాణకట్ట, వ‌స‌తి గృహ‌లు, అతిథి భ‌వ‌నాలు, యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలు, అన్న ప్రసాద కేంద్రాలను పూర్తిగా మూసివేస్తున్నామన్నారు.

1892 తర్వాత..

దేవస్థానంలో లభ్యమవుతున్న రికార్డుల మేరకు 1892లో రెండు రోజులపాటు ఆలయం మూతపడిందని ఈవో తెలిపారు. మహంతులు, అర్చకుల మధ్య విభేదాలతో రెండు రోజులు మూసేశారని... ఇప్పుడు కైంకర్యాలు కొనసాగిస్తూనే భక్తుల ఆలయ ప్రవేశంపై మాత్రమే నిషేధం విధిస్తున్నామని ఈవో ప్రకటించారు.

యూపీ భక్తుడికి కరోనాలక్షణాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు వారం రోజులుగా చర్యలు తీసుకున్న అధికారులు.. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు కరోనా వ్యాధి లక్షణాలతో శ్రీవారి దర్శనానికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురవటంతో మరింత అప్రమత్తమయ్యారు. 110 మంది భక్తులతో కలిసి మీర్జాపూర్‌ నుంచి వచ్చిన బృందంలోని 65 సంవత్సరాలు పైబడిన వృద్ధుడు కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత అత్యవసరంగా సమావేశమైన దేవస్థానం ఉన్నతాధికారులు.. పరిస్థితిని సమీక్షించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలపై చర్చించారు.

స్థానిక ఆలయాల దర్శనం నిలిపివేత

తితిదే పరిధిలోని స్థానిక ఆల‌యాలైన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు, తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యాల‌్లో ఉగాది ఆస్థానం ఏకాంతంగా నిర్వహించడం సహా తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు, తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ‌నివాస‌మంగాపురం క‌ల్యాణ వెంక‌టేశ్వర‌స్వామి ఆల‌యాల్లో భ‌క్తుల ప్రవేశాన్ని వారం రోజుల పాటు నిలిపివేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య

Last Updated : Mar 20, 2020, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details