తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు.. తితిదే ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి - పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి అర్చుకులు.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే