తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ. రమణ దర్శించుకున్నారు. ఉదయం 7:45 గంటలకు ఆలయం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి కలిసి స్వాగతం పలికారు. శ్రీవారి చక్రస్నానంలో సీజేఐ పాల్గొన్నారు. అనంతరం స్వామివారని దర్శించుకున్నారు. సీజేఐతో పాటు హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
TTD: శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - tirumala bramhotsavam
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సీజేఐతో పాటు హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి స్వామివారిని దర్శించుకున్నారు.
cji