చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాకిక్ష కర్ఫ్యూ అమలులో ఉంది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. తిరుపతిలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. తిరుపతిలో కర్ఫ్యూను ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దర్శన టికెట్ బుక్‌చేసుకున్న శ్రీవారి భక్తులను అనుమతిస్తున్నట్లు ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు.
'దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చు' - తిరుమలలో కరోనా కేసులు
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాకిక్ష కర్ఫ్యూ అమలులో ఉంది. దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చని చిత్తూరు జిల్లా ఎస్పీ అప్పలనాయుడు వెల్లడించారు.
chittor sp appalanaidu