ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టమాటా బోర్డు ఏర్పాటుకు కృషి: ఎంపీ రెడ్డప్ప - చిత్తూరు వార్తలు

చిత్తూరు జిల్లా టమోటా రైతుల కష్టాలపై ఈటీవీ-ఈనాడు ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. రైతుల సమస్యలను పార్లమెంట్​లో చర్చించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు

chittor-mp-reddappa-comments-on-tomato-farmers
టమోటా రైతుల కష్టాలపై ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన

By

Published : May 27, 2020, 3:25 PM IST

టమోటా రైతుల కష్టాలపై ఈటీవీ-ఈనాడు కథనానికి స్పందన

టమాటా రైతుల కష్టాలపై ఈటీవీ-ఈనాడు ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. సాగును నమ్ముకుని... అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల బాట పడుతున్న టమాటా రైతుల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తామని చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం హామీ ఇచ్చింది. 'మన పాలన-మీ సూచన' కార్యక్రమంలో భాగంగా ఎస్వీ యూనివర్సిటీలో రెండో రోజు... వ్యవసాయంపై జరిగిన చర్చలో... టమాటా రైతుల కష్టాలను అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

జిల్లా వ్యాప్తంగా 50వేల హెక్టార్లలో టమాటా సాగుచేసిన రైతులు...లాక్ డౌన్ కారణంగా పడుతున్న ఇబ్బందులను అధికారులు... ఉప ముఖ్యమంత్రి, చిత్తూరు ఎంపీలకు వివరించారు. రైతన్నల కష్టాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అధికారులకు తెలుపగా....రాయలసీమకు ప్రత్యేక టమాటా బోర్డు ఏర్పాటుచేసేలా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రకటించారు.

ఇవీ చదవండి:టమాటా రైతులకు మిగిలింది కంట కన్నీరే

ABOUT THE AUTHOR

...view details