Red Sandalwood Seized in Chittoor: కోటిన్నర రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యదళ సిబ్బందికి .. తరలించడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలు కంటపడ్డాయి. అటవీ ప్రాంతంలోనే మాటు వేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది.. దుంగలను తరలించేందుకు వచ్చారు.
వీరిలో కెవిబి పురానికి చెందిన సురేంద్రను అరెస్టు చేశారు. విచారణలో సురేంద్ర ఇచ్చిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రం విచ్చురు ప్రాంతంలోని ఓ గోడౌన్ లో తమిళనాడు పోలీసులతో కలిసి టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. 2 టన్నుల 86 కేజీల ఏ గ్రేడ్ దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ నిర్వాహకులతోపాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్టు చేస్తామని టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందర్ రావు తెలిపారు.