చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు తిరుపతిలో ఆరు, నగరిలో నాలుగు, పలమనేరులో మూడు, శ్రీకాళహస్తిలో రెండు, రేణిగుంటలో రెండు, ఏర్పేడు, నిండ్రలో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నమోదైన 19 కరోనా పాజిటివ్ కేసుల్లో రుయా ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతుండగా..పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిలో 10మంది వైద్యసేవలు అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లా ఆసుపత్రిని కోవిడ్-19 జిల్లా ఆసుపత్రిగా ప్రకటించారు. దీంతో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులకు అక్కడే చికిత్స అందించడానికి వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 940 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించి నమూనాలు సేకరించగా 643 నమూనాలు నెగిటివ్గా వచ్చాయి. మరో 277 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.