చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. నగరాలు, పట్టణ ప్రాంతాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు జిల్లాలో వైరస్ వ్యాప్తిని స్పష్టం చేస్తున్నాయి. శనివారం జిల్లాలో 300 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6869కి చేరింది. శనివారం కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా...జిల్లాలో మృతుల సంఖ్య 73కి చేరుకుంది.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 300 కరోనా కేసులు... ఐదుగురు మృతి
చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జిల్లాలోని పలు నగరాలు, పట్టణాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 300 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 6869కు చేరింది. కేసులు పెరుగుతున్న కారణంగా తిరుపతిలో దుకాణాలు తెరిచే సమయాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో కొత్తగా 300 కరోనా కేసులు... ఐదుగురు మృతి
తిరుపతిలో దుకాణాల నిర్వహణకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. 11 గంటల తర్వాత దుకాణాలను మూసివేయడంతో పాటు.. రోడ్ల పైకి వాహనాలను, ప్రజలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. జిల్లాలో చిత్తూరు, నగరి, మదనపల్లెలలో లాక్ డౌన్ ఇప్పటికే అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు 3901 మంది కరోనా నుంచి కోలుకోగా, 2895 మంది జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి :ఏకాంతంగా... శ్రీవారి గరుడ వాహన సేవ