ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు కుర్చీ భయం పట్టుకుంది: చింతా మోహన్ - చింతా మోహన్ న్యూస్

తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ రాకపోవటానికి కారణం కరోనా కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. జగన్​కు కుర్చీ భయం పట్టుకుందని..అందుకే సచివాలయంలోని కుర్చీని అంటిపెట్టుకుని కూర్చున్నారంటూ ఎద్దేవా చేశారు.

Chintha Mohan commments on cm jagan
సీఎం జగన్​కు కుర్చీ భయం పట్టుకుంది

By

Published : Apr 11, 2021, 4:13 PM IST

సీఎం జగన్​కు కుర్చీ భయం పట్టుకుంది

ముఖ్యమంత్రి జగన్​కు కుర్చీ భయం పట్టుకుందని కేంద్రమాజీ మంత్రి, తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ విమర్శించారు. నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన...కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ...తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి సీఎం జగన్ రాకపోవటానికి కారణం కరోనా కాదన్నారు. సీఎం జగన్​కి కుర్చీ భయం పట్టుకుందన్న చింతా.. చిత్తూరు జిల్లా నుంచి ఒకరు, విజయనగరం జిల్లా నుంచి మరొకరు..జగన్ కుర్చీ కోసం చూస్తున్నారన్నారు. అందుకే జగన్ సచివాలయంలోని కుర్చీని అంటిపెట్టుకుని కూర్చున్నారంటూ ఎద్దేవా చేశారు. తిరుపతి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details