రాజకీయాలంటే త్యాగం, సేవ చేయడమే తప్ప దోచుకోవడం, దాచుకోవడం కాదని చింతా మోహన్ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన జగన్కు.. వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇసుక, ఎర్రచందనం, మద్యం అన్నిటిలోనూ జగన్ వేల కోట్లు దోచుకుంటున్నారని చింతా మోహన్ ఆరోపించారు.
ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్నాన్ని వైకాపా నేతలు ఆపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు విరమించకుంటే.. తాను గవర్నర్, భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసి.. వాస్తవాలు వివరిస్తానని ఆయన హెచ్చరించారు.