సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పలు అక్రమాలకు పాల్పడ్డారని వైకాపా నేత, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరోపించారు. ఐపీఎస్ అధికారిగా తనకున్న అధికారాలను వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి వినియోగించారని... దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారని అన్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడాలంటే భయపడేలా ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు అందచేసిన వెంకటేశ్వరరావుపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని చెవిరెడ్డి కోరారు. అక్రమ సంపాదనతో తెలంగాణలోనూ వందల ఎకరాల భూములు కొన్నారని... బెంగళూరులో వేల కోట్ల రూపాయల విలువ చేసే పొలాలు ఉన్నాయని ఆరోపించారు.
'ఏబీ వెంకటేశ్వరరావు... దేశ భద్రతను ఫణంగా పెట్టారు' - ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకటేశ్వరరావు తన స్వలాభం కోసం దేశ భద్రతను ఫణంగా పెట్టారని అన్నారు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. వెంకటేశ్వరరావుకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములున్నాయని వెల్లడించారు.
!['ఏబీ వెంకటేశ్వరరావు... దేశ భద్రతను ఫణంగా పెట్టారు' chevireddy bhaskar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6025033-1068-6025033-1581337586787.jpg)
chevireddy bhaskar reddy
ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు