తిరుపతిలో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు చేపడతామని… కొవిడ్-19 తిరుపతి సమన్వయ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు.
'ఎవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం'
తిరుపతి పరిధిలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో కొవిడ్-19 వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు.
bhaskar reddy
తిరుపతి పరిధిలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో కొవిడ్-19 వైద్య సేవలు అందించాలని సూచించారు. టెస్టుల అనంతరం మెరుగైన వైద్యం, సౌకర్యాలు వంటి వాటిపై దృష్టి సారించాలని, ఈ వైరస్‌కు ఎవరూ అతీతులు కాదని చెప్పుకొచ్చారు. ఈ కరోనా కాలంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అందరి అధికారులను కలుపుకొని బాధితులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.