CHEETAH ATTACK IN TIRUMALA GHAT ROAD: తిరుమల ఎగువ కనుమదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు నీటి సరఫరా విభాగ ఉద్యోగులపై చిరుత దాడి చేసింది. వినాయక స్వామి ఆలయం దాటుకున్న తరువాత.. మలుపులో చిరుత ఒక్కసారిగా ద్విచక్ర వాహనంపై దూకింది.
CHEETAH IN GHAT ROAD: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం.. ఇద్దరికి గాయాలు - తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరిపై చిరుత దాడి
CHEETAH ATTACK IN GHAT ROAD: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు చిరుత దాడిలో స్వల్పంగా గాయపడ్డారు.
CHEETAH ATTACK IN TIRUMALA GHAT ROAD
ఈ ఘటనలో చిరుత గోళ్లు గీరుకుని ఆనందయ్య, రామకృష్ణలు స్వల్పంగా గాయపడ్డారు. వాహనం ఆపకుండా వేగంగా ముందుకు ప్రయాణించి చిరుత నుంచి తప్పించుకున్నట్లు వారు తెలిపారు. ఘటనపై వారు భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. క్షతగాత్రులను అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
ఇదీ చదవండి:TTD YV SUBBA REDDY: ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన తితిదే ఛైర్మన్