ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cheetah At Tirumala: తిరుమల కనుమదారిలో చిరుత సంచారం - సుండిపెంటలో ఎలుగుబంటి సంచారం

cheetah at Tirumala : తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో ప్రయాణికులకు చిరుత పులి కనిపించింది. భక్తులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. వాహనాల నుంచి ఎక్కడా కిందికి దిగవద్దని హెచ్చరించారు.

Chita at Tirumala
తిరుమల కనుమదారిలో చిరుత సంచారం...

By

Published : Jan 14, 2022, 7:30 AM IST

cheetah at Tirumala : తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో చిరుతపులి భక్తులకు కనిపించింది. ఎగువ కనుమదారిలో హరిణికి సమీపంలో రహదారి పక్కనున్న పట్టి గోడపై తిష్టవేసింది. చిరుతను గమనించిన ప్రయాణికులు వాహనాన్ని నిలిపారు. వాహనాల అలికిడికి చిరుత అక్కడినుంచి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది భక్తులను అప్రమత్తం చేశారు. కనుమ దారుల్లో వాహనాల నుంచి ఎక్కడా కిందికి దిగవద్దని హెచ్చరించారు.

శ్రీశైలం సుండిపెంటలో ఎలుగుబంటి సంచారం..

కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి ఎలుగుబంటి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామ శివారులో ఉన్న రిక్షా కాలనీ, ప్రాజెక్ట్ ఆసుపత్రి సమీపంలో రాత్రి వేళ ఎలుగుబంటి వస్తోంది. గురువారం సాయంత్రం ఎలుగుబంటి రావడంతో అటవీశాఖ సిబ్బంది, స్థానికులు తరిమి వేశారు. ఇనుప బోనులు ఏర్పాటు చేసి ఎలుగుబంటిని పట్టుకొని అడవిలో వదిలి వేసే చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి : తిరుమల: శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details