ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఓ నాటకంలో పాల్గొన్నాం'

శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు. శివప్రసాద్​తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా బహుముఖ పాత్ర పోషించారని కొనియాడారు.

చంద్రబాబు

By

Published : Sep 22, 2019, 4:47 PM IST

Updated : Sep 22, 2019, 5:13 PM IST

చంద్రబాబు

మాజీ ఎంపీ శివప్రసాద్ భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులర్పించారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు...శివప్రసాద్, తాను కలిసి చదువుకున్నామని గుర్తు చేశారు. ఆయన వైద్యుడిగా ఉంటూనే సినీరంగంపై ఇష్టం పెంచుకున్నారని చెప్పారు. తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు చంద్రబాబు వివరించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా బహుముఖ పాత్ర పోషించారని కొనియాడారు.

శివప్రసాద్‌కు నివాళులు అర్పిస్తానని అనుకోలేదని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. తనపై ఉన్న నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎనలేని పోరాటం చేశారన్న చంద్రబాబు... ప్రజాసమస్యలను తనదైన శైలిలో తెలియజేశారని చెప్పారు. చిత్తూరు లోక్‌సభ స్థానం ఓడిపోతామని అనుకోలేదని పేర్కొన్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్‌ అజాతశత్రువని కొనియాడారు.

శివప్రసాద్ ఎంపీగా ఉంటూనే రాష్ట్రానికి అనేక సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం దిల్లీలో పోరాటం చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో, వైద్యంలో, సినీరంగంలో సేవలు అందించారని కొనియాడారు. శివప్రసాద్ ఆశయాల సాధనకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఓ నాటకంలో పాల్గొన్నామని చంద్రబాబు స్మరించుకున్నారు.

ఇదీ చదవండీ... ఏఓబీలో ఎదురు కాల్పులు.. ఐదుగురు మావోయిస్టుల మృతి

Last Updated : Sep 22, 2019, 5:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details