తిరుపతి నుంచి హైదరాబాద్కు పయనమైన చంద్రబాబు - రేణిగుంట నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు న్యూస్
19:10 March 01
తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయంలో 10 గంటలపాటు చంద్రబాబు నిరసన తెలిపారు.
చిత్తూరు, తిరుపతిలో జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు చంద్రబాబు ఇవాళ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేదంటూ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ కారణంగా రేణిగుంట విమానాశ్రయంలోనే నేలపైనే చంద్రబాబు బైఠాయించారు. చంద్రబాబుతో తిరుపతి అర్బన్ ఎస్పీ, ఆర్డీవో పలుసార్లు చర్చించారు. ఈ మేరకు చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. అనంతరం హైదరాబాద్ పయనమయ్యారు.