తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ ఎంపీ శివప్రసాద్‌లు మంచి స్నేహితులు. రాజకీయాల్లోకి రాకముందే వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని పులిత్తివారిపల్లిలో 1951లో శివప్రసాద్ జన్మించారు. నాగయ్య, చెంగమ్మ దంపతుల సంతానమైన శివప్రసాద్... ఐతేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేరారు. అక్కడే నారా చంద్రబాబు నాయుడితో స్నేహం ఏర్పడింది. ఆరో తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకూ వీరిద్దరూ అక్కడే చదువుకున్నారు. బాల్యమిత్రుడు చంద్రబాబుతో గడిపిన సందర్భాలను శివప్రసాద్ తరచూ గుర్తు చేసుకునేవారు.
శివ-చంద్రుల స్నేహం అలనాటిది...! - chandrababu, shivaprasad were childhood friends
మాజీ ఎంపీ శివప్రసాద్, తెదేపా అధినేత చంద్రబాబు బాల్యమిత్రులు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. చంద్రబాబుతో గడిపిన చిన్ననాటి సంగతులను శివప్రసాద్ తరచూ గుర్తు చేసుకునేవారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు, శివప్రసాద్ కలిసి చదువుకున్నారు.
శివ - చంద్రుల స్నేహం అలనాటిది...!
Last Updated : Sep 21, 2019, 11:41 PM IST