ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా అరాచకాలకు.. బదులు చెప్పి తీరుతాం - చంద్రబాబు

Chandrababu Fired on YCP: రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయనీ.. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారనీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తన ప్రాణాలను అడ్డు పెట్టి కార్యకర్తల ప్రాణాలను కాపాడుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Chandrababu Fired on YCP
Chandrababu Fired on YCP

By

Published : May 8, 2022, 8:28 PM IST

Updated : May 9, 2022, 5:49 AM IST

Chandrababu Fired on YCP: ‘రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి. వైకాపావాళ్లు ఇప్పుడు తమకు పొత్తులు అక్కర్లేదని ఎగిరిపడుతున్నారు. మీ నాన్న కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెరాస, సీపీఐ, సీపీఎంతో కలిసి మహాకూటమి కట్టారు. మీ నాన్న కంటే గొప్పోడివా?’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. పులినని చెప్పుకొనే జగన్‌మోహన్‌రెడ్డికి ఇప్పుడు పోలీసుల భద్రత లేనిదే ప్రజల్లో తిరిగే ధైర్యం లేదన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సందీప్‌ తల్లి శ్రీదేవి ఇటీవల మరణించడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు ఆదివారం చిత్తూరు వచ్చారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయనీ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారనీ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త రాజారెడ్డిని చిత్తూరులో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రాజారెడ్డిపై దౌర్జన్యం చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కల్లూరులో ధర్నా చేసిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి సందీప్ కు చెందిన కోళ్ల ఫారంపై వైకాపా నాయకులు దాడులు చేశారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వీటన్నిటికీ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

వైకాపా అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు -చంద్రబాబు

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనీ.. ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి అరాచకాలను ఎన్నడూ చూడలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా విత్ డ్రా చేయించి అడ్డగోలుగా గెలిచారని ధ్వజమెత్తారు. పుంగనూరులో వైకాపాకు మెజార్టీ లేదని.. రానున్న ఎన్నికల్లో చల్లా బాబును తమ పార్టీ అభ్యర్థిగా నిలబెడతామని చెప్పారు. పోలీసులను ఉపయోగించుకుని తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు లేకుండా సీఎం జగన్ ఒకసారి బయటకు రావాలని కోరారు. గ్రామాల్లో తిరుగుబాటు మొదలైందని... వైకాపాకు రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని స్పష్టం చేశారు. పులి అని చెప్పుకునే జగన్ పిల్లిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. తన ప్రాణాలను అడ్డు పెట్టి కార్యకర్తల ప్రాణాలను కాపాడుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated : May 9, 2022, 5:49 AM IST

ABOUT THE AUTHOR

...view details