తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి వేలాదిగా వైకాపా కార్యకర్తలు వెళ్లారన్నారు. పోలింగ్ జరిగే నియోజకవర్గంలో ర్యాలీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు: చంద్రబాబు - tirupati by poll 2021
![తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు: చంద్రబాబు fake votes in tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11435456-252-11435456-1618643704360.jpg)
తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం
12:19 April 17
తెదేపా నేతల అరెస్టులను ఖండిస్తున్నా: చంద్రబాబు
దొంగ ఓటర్లను అడ్డుకున్న తెదేపా నేతల అరెస్టులను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు..? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న తెదేపా నేతలనే అరెస్టు చేస్తారా..? అక్రమంగా అరెస్టు చేసిన తెదేపా నేతలను వెంటనే విడుదల చేయాలి- చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి:
Last Updated : Apr 17, 2021, 12:50 PM IST