తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార బరిలో తెదేపా అధినేత చంద్రబాబు అడుగుపెట్టనున్నారు. ఈ నెల ఏడో తేదీన రాత్రి తిరుపతి చేరుకోనున్న ఆయన... 8న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం.. సత్యవేడు నుంచి పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది.
చంద్రబాబు వారం రోజులపాటు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉండి, రోజుకు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రచారం చేస్తారు. ఒక్కో నియోజకవరం పరిధిలో రెండు మూడు ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. తిరుపతి లోక్‌సభ స్థానంలో పరిధిలో తెదేపా నాయకులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా.. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.