తిరుపతి ఉపఎన్నిక ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యనించారు. తిరుపతిలో రోడ్‌షోకు హాజరైన చంద్రబాబు..రెండేళ్ల అరాచక పాలనకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు. వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయన్నారు. తితిదే ఉద్యోగులకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అమరావతిని వైకాపా నేతలు విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. 2029 నాటికి ఏపీని నెంబర్‌వన్ చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
'వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయ్' - తిరుపతిలో చంద్రబాబు సభ
వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రెండేళ్ల అరాచక పాలనకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు.
!['వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయ్' chandrababu comments on ap govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11379602-149-11379602-1618238491231.jpg)
వైకాపాకు తిరుపతిలో బుద్ధి చెప్పకపోతే అరాచకాలు పెరుగుతాయ్