తిరుపతిలో సీనియర్ కెమెరామెన్‌గా పని చేస్తున్న సారధి కొవిడ్ సోకి మరణించారు. ఆయన మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 దశాబ్దాల పాటు మీడియాలో సారధి విశేష సేవలందించారన్న చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా మీడియా ప్రతినిధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని లోకేశ్ కోరారు. సంక్షోభ సమయంలో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులు తమతో పాటు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.