తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏళ్ల తరబడి అనుసరిస్తున్న సంప్రదాయాన్ని ఓ వ్యక్తి కోసం మార్చేయడం సరికాదన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. నమ్మకం లేని ఓ వ్యక్తి కోసం అనాధిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమని అభిప్రాయపడ్డారు. సమాజానికే అరిష్ఠమని ధ్వజమెత్తారు. అది ఆధ్యాత్మిక ద్రోహమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉందని గుర్తు చేశారు.
'పాలకులు మారినప్పుడల్లా... సంప్రదాయాలు మారవు' - తిరుమలలో డిక్లరేషన్ పై వార్తలు
పాలకులు మారినప్పుడల్లా సంప్రదాయాలు మారవని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ వివాదంపై ఆయన స్పందించారు. ఓ నమ్మకం లేని వ్యక్తి కోసం అనాధిగా అనుసరిస్తున్న ఆచారాన్ని మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు.
చంద్రబాబు ట్వీట్
వాల్మీకి మాటలు ట్వీట్ చేసిన చంద్రబాబు... మతం అంటేనే నమ్మకమన్నారు. సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని స్పష్టం చేసిన ఆయన... సనాతనమంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏ నాటికీ మారని శాశ్వత ధర్మమని పేర్కొన్నారు. పాలకులు మారినప్పుడల్లా సనాతన ధర్మ, సంప్రదాయాలుమారబోవని తేల్చిచెప్పారు. అలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్