ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ - తిరుమల ఆలయం తాజా వార్తలు

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దర్శించుకున్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

By

Published : Mar 3, 2021, 2:11 PM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి.. తితిదే ఆధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి.. శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details