తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. దిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రిని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి వసతిగృహంలో బసచేసి... శనివారం ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొంటారు. శ్రీవారి దర్శనానంతరం మంత్రి తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.
కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న కేంద్రమంత్రి - గజేంద్ర సింగ్ షెకావత్ తాజా వార్తలు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీనివాసుని దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. శనివారం దర్శనం అనంతరం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.
తిరుమల చేరుకున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి
TAGGED:
tirumala latest news