ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) తమ శాఖ పరిధిలోకి వస్తున్నందున దాని ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. అలాగే జాతీయ ప్రాధాన్యం ఉన్న స్మారక చిహ్నాలు దేశంలో 3,693 ఉండగా... ఏపీలో 135, తెలంగాణలో 8 ఉన్నాయని చెప్పారు.
తిరుపతి మా పరిధిలోకి రాదు.. పార్లమెంట్లో కేంద్రమంత్రి - కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తాజా వార్తలు
తిరుపతి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ పేర్కొన్నారు. ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

తిరుపతి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ