ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి - ఏపీ తాజా వార్తలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను, ఆలయాల నిర్మాణం, ధూప దీప నైవేద్యాలకు తితిదే సహకారం ఆందించాలని కిషన్ రెడ్డి కోరారు.

central minister
central minister

By

Published : Feb 20, 2021, 10:45 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

కరోనా తగ్గుముఖం పడుతోందని.. ప్రజలందరూ కరోనా టీకా​ వేయించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలను, ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాలకు తితిదే సహకారం అందించాలన్నారు. శేషాచలంలోని ఎర్రచందనం కాపాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details