శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమలలో పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఆయన ఎర్రచందనం మొక్కలను నాటారు. గతంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఎర్రచందనం పరిరక్షణ కోరుతూ తాను ఉద్యమం చేశానని గుర్తు చేసుకున్నారు. ఎర్రచందనం ప్రత్యేక కార్యదళాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వంపైన ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం జగన్కు లేఖ రాశానన్నారు. ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, భాజపా అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి: కేంద్ర మంత్రి - తిరుపతి తాజా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉదయం శ్రీవారిని దర్శించుకునారు. అనంతరం తిరుమలలో పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఎర్రచందనం మొక్కలను నాటారు. ఎర్రచందనం వృక్షాల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
Central Minister Kishan