ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ​తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి ఇతర అధికారులు కలిసి స్వాగతం పలికారు. మరికొంత మంది ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

kishanreddy
kishanreddy

By

Published : Aug 19, 2021, 8:14 AM IST

Updated : Aug 19, 2021, 9:45 AM IST

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రరాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గి దేశంలో పరిస్థితులు చక్కబడాలని ప్రార్థించానన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాలని తిరుమల స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రెండేళ్లుగా కరోనా వైరస్.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. పూర్తి స్థాయిలో కరోనాను అరకట్టాల్సిందిగా.. భగవంతుడిని ప్రార్థించా. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలని సైతం వేంకటేశ్వర స్వామిని కోరుకున్నా. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున తప్పకుండా సహకారం అందిస్తాం - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

శ్రీవారిని దర్శించుకున్న 20,701 మంది భక్తులు..

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని 20,701 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,945 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.06 కోట్లు కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

Agrigold: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తుకు.. నేటి సాయంత్రం వరకు అవకాశం!

Last Updated : Aug 19, 2021, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details