ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హస్తానికి అవకాశం ఇవ్వండి: కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ - తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్​ ప్రచారం

తిరుపతి ఉప ఎన్నికలో హస్తం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రజలను కోరారు. అటు భాజపా ఇటు వైకాపా.. రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.

Central Ex Minister Chintha mohan
మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్

By

Published : Mar 24, 2021, 8:38 PM IST

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ​ ఉప ఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్ ధర్మయుద్ధం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి నాలుగు కాళ్ల మండపం నుంచి కృష్ణాపురం ఠాణా వరకూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచిపెడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

అటు భాజపా ఇటు వైకాపా రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్న చింతామోహన్.. జరుగుతున్న వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇచ్చి అభివృద్ధి కోసం తిరుపతి వాసులు నిలబడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details