ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - celebrities visited thirumala thirupathi

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి...శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు.

celebrities  visited thirumala thirupathi
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

By

Published : Nov 20, 2020, 3:51 PM IST

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తమిళనాడు మంత్రి ఉదయ్ కుమార్, భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు.

పాలనాపరమైన ఉత్తర్వులన్నీ తెలుగులో వచ్చేలా కృషి చేస్తున్నామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు సామాన్య ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:

సంకల్​బాగ్ ఘాట్​లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details